ఆన్సరింగ్ ఇస్లాం తెలుగు వెబ్ సైటు గురించి మీ అభిప్రాయం

ఆన్సరింగ్ ఇస్లాం తెలుగు వెబ్ సైటు విభాగానికి మిమ్ములను హృదయపూర్వకముగా ఆహ్వానించుచున్నాము. ఈ వెబ్ సైటు గురించి మీ అభిప్రాయాన్ని తప్పకుండా మాతో పంచుకోగలరు. మాకు వ్రాసే ప్రతి వారికి తప్పకుండా బదులు వ్రాయటానికి మేము ప్రయత్నిస్తాము. మీ అభిప్రాయాన్ని మేము హృదయపూర్వకముగా స్వాగతిస్తున్నాము. మీ అభిప్రాయములు మాకెంతో విలువైనవిగా మేము భావిస్తాము. ఈ వెబ్ సైటులో పొందుపరచబడిన రచనల గురించిన మీ అభిప్రాయములు, సలహాలు, ఆక్షేపణలు, ప్రశ్నలు ఏవైనా ఉంటే తప్పక మాకు వ్రాయగలరు. మీరు వేసే ప్రతి ప్రశ్నకు బదులిచ్చుటకు తప్పకుండా మేము ప్రయత్నిస్తాము. కానీ బదులిచ్చుటకు మాకు కొంత సమయం తప్పకుండా పడుతుంది గనుక మీరు కొంత సమయం వేచి ఉండవలసినదిగా మా మనవి. సాధారణంగానైతే ఒకటి లేక రెండు వారములలోనే మీకు బదులు ఇస్తాం. మా నుండి మీరు పొందే ప్రత్యుత్తరం ఏదైనా సరే అది తెలుగు భాషలోనే ఉంటుందని గమనించగలరు.

1) మా వెబ్ సైటు గురించి ఆక్షేపణ చేసేవారికోసం:
మీరు మా వెబ్ సైటులో పొందుపరచబడిన రచనల మీద మీమాంస జరుపదలచిన యెడల, లేక ఎదైనా ప్రశ్న వె్యదలచిన యెడల తప్పకుండా మమ్ములను సంప్రదించగలరు. మీరు మాకు వ్రాసేటప్పుడు, ఏ వ్యాసం లేక రచన గురించి మీరు ప్రశ్నిస్తున్నారో స్పష్టముగా తెలుపగలరు, మరియు ఆ రచన యొక్క వెబ్ సైటు లింక్ తప్పకుండా తెలుపగలరు. మీ వివరములు మరియు విశ్లేషణలు కూడా పంపినట్లయితే మాకు ఇంకా సహాయకరముగా ఉంటుంది. మీ ప్రతి ప్రశ్నను మా పండితులు చదివి వాటికి తప్పకుండా ప్రత్యుత్తరమిచ్చుటకు ప్రయత్నిస్తారు.

2) మాకు సహాయపడాదలచే వారికోసం:
అ) ఈ వెబ్ సైటు లోని రచనలను చదివిన పిదప మీరు మాకు సహాయపడదలచినచో మమ్ములను తప్పక సంప్రదించగలరు. ఈ క్రింద వివరించబడిన విధానాల్లో మీరు మాకు సహాయపడగలరు. ఆంగ్ల వెబ్ సైటులో ఉన్న వ్యాసములలో కొన్నింటిని మీరు తెలుగులో అనువదించి మాకు తోడ్పడగలరు. ఈ విధంగా మీరు కూడా కొన్ని రచనలను అనువదించదలచినచో, మీకున్న ఆ కోరికను మాకు తెలుపగలరు. అప్పుడు మేము ఏఏ వ్యాసాలు తెలుగులో లేవో, వేటిని ఆంగ్లంనుండి అనువదించాలో మీకు తెలుపగలము. అప్పుడు మీరు వాటిని సులభముగా అనువదించి మాకు పంపవచ్చును.
ఆ) మా రచనలలోని తెలుగు పదాలలో, లేక పదవిన్యాసములలో ఏదైనా పొరపాటును మీరు గమనించినట్లయితే తప్పకుండా మాకు తెలుపగలరు. వాటిని బట్టి తప్పకుండా మీకు ఋణపడి ఉంటాం.
ఇ) మా రచనలలో కనుక ఏదైనా పాషండమో లేక అభ్యంతరకర పదజాలమో ఉన్నట్లయితే తప్పకుండా వ్యక్తపరచగలరు. మీరు మాకు వ్రాసేటప్పుడు, అది ఏ వ్యాసం లేక రచనలో ఉందో స్పష్టముగా తెలుపగలరు, మరియు ఆ రచన యొక్క వెబ్ సైటు లింక్ తప్పకుండా తెలుపగలరు. మా పండితులు మీ వ్యాఖ్యలను చదివి సరైన నిర్ణయం తప్పక తీసుకుంటారు.

మమ్ములను సంప్రదిచుటకై, క్రింద ఉన్న ఖాళీ స్థలములను పూరించి మాకు పంపగలరు. తెలుగులో వ్రాయుటకై ఈ - గూగల్ ఇండిక్ ట్రాన్స్‌లిటరేషన్ ఫర్ తెలుగు - వెబ్ లింక్‍పై క్లిక్ చేయండి. అక్కడ నుండి కాపీ చేసి ఈ క్రింద పేస్ట్ చేయండి.

మీరు మాకు ఏదైనా ఆర్థిక సహాయం అందించదలచినచో మా ఆంగ్ల వెబ్ సైటు ద్వారా చేయగలరు.