ఆన్సరింగ్ ఇస్లాం వెనుక ఉన్నదెవరు?

అనేక మంది మాకు ఈ-మెయిళ్లను వ్రాసి, అసలు మీరు ఎవరు, ఇస్లాం గురించి మాట్లాడుటకు మీకున్న అర్హతలు ఏమిటి, మీ విశ్వాస ప్రమాణం ఏమిటి? అనే పలు ప్రశ్నలు అడుగుచున్నారు.

కొందరేమంటున్నారంటే, మీ వెబ్ సైటు మాకు చాలా నచ్చింది, దానిని ఇతరులకు కూడా పరిచయం చేయాలనుకుంటున్నాము, కానీ దానికి ముందుగా మీరెవరో, మీరేమి నమ్ముచున్నారో మాకు తెలిసుండాలిగదా అని అడుగుచున్నారు.

ఒకవేళ మీరు కూడా ఇటువంటి ప్రశ్నలే అడాగాలని అనుకుంటే, దానికంటే ముందుగా మేము మిమ్మల్ని ఈ విధంగా ప్రశ్నిస్తాము: ఈ ప్రశ్నలకు మీరు జవాబులు ఎందుకు వెదకుతున్నారు? అందరూ సాధారణంగా ప్రశంసించే మా వెబ్ సైటు వ్యాసములకు ఉన్న నాణ్యత మీకు సరిపోదా?

ఏదో కొందరు ప్రముఖ వ్యక్తుల, సంస్థల, లేక చర్చిల పేర్లు జోడించుట చేత ప్రజలు మా వాదనలను నమ్మాలనే కోరిక మాకెంత మాత్రము లేనే లేదు. సాధారణంగా ఈ ప్రశ్న క్రైస్తవులే వేస్తూ ఉన్నారు. వారు ఇతర క్రైస్తవులకు ఈ వెబ్ సైటును పరి్చయం చేయటానికి ముందు మేము సువార్తకు ముఖ్య స్థానమిచ్చే సౌవార్తిక క్రైస్తవులమో కాదో తెలుసుకోవటానికని ఈ ప్రశ్న వేస్తున్నారు.

మేమేదో సౌవారిక క్రైస్తవులమని చెప్పుటచేతనో, లేక మా రచయితల పేర్ల ప్రక్కన వారి అర్హతలో లేక బిరుదులో చేర్చుట వల్లనో, క్రైస్తవులుగాని మరింకెవరైనాగాని మా రచనలను నమ్మాలని మేము కోరుకొనుట లేదు. కానీ మా రచనలన్నీ దేవుని వాక్యానుసారమైనవని, సాక్ష్యాధారసహితమైనవని, మెచ్చదగిన తర్కము కలిగినవని ఎరిగి ఆ తర్వాతే ఎవరైనా నమ్మాలని మేము కోరుకొనుచున్నాము.

జాగ్రత్తతోనూ, విమర్శనాత్మకంగానూ ఉండిన విశ్వాసులను పరిశుద్ధ గ్రంథం ఈ విధంగా ప్రశంసిస్తోంది:
"వీరు (బెరయలోని విశ్వాసులు) థెస్సలొనీకేలో ఉన్నవారికంటె యోగ్యులైయుండిరి గనుక సంపూర్ణ సిద్ధమనస్సుతో వాక్యమును అంగీకరించి, పౌలును సీలయును చెప్పిన సంగతులు పరిశోధించుచు వచ్చిరి".  అపోస్తలుల కార్యములు 17:11.

బెరయలోని విశ్వాసులు పౌలుగారి మాటలను ఎందుకు నమ్మారు? మాట్లాడినది ఎంతో పేరెన్నికగల పౌలుగారనా? లేక ఆయన యెరూషలేములోని అపోస్తలుల మండలినుండి ఆమోదానుమతులు పొందినవారనా? కానేకాదుగాని, వారే స్వయంగా ఆయన మాటలను పరిశీలన చేసి అవి వాస్తవమని, లేఖనానుసారమైనవని తెలిసికొనుటచేతనే నమ్మిరి.

మా పాఠకులు కూడా బెరయలోని విశ్వాసులవలె ఉండాలనేది మా కోరిక. మేమిక్కడ అందించే రచనలు మరియు పాఠ్య సామగ్రి యొక్క యథార్థత మరియు పారదర్శకతవల్ల ముస్లింలు నిజ విశ్వాసంలోకి రావాలని, అంతేకాకుండా క్రైస్తవ సహోదర సహోదరీలు కూడ వారి క్రైస్తవ విశ్వాసంలో బలపడి మోసకరమైన ఇస్లాంని గూర్చిన విషయాలలో కూడ స్పష్టత కలిగి ఉండాలని ఆశిస్తున్నాము: ఎందుకంటే ఇక్కడ పొందుపరచబడిన విషయాలన్నీ వాస్తవాలు మరియు సత్యమైనవి గనుక.

ఐతే విచార విషయమేమనగా, సౌవార్తిక క్రైస్తవులు ఇస్లాం గురించి (నిజానికి బైబిల్ మరియు క్రైస్తవ విశ్వాసం గురించి వారు) చెప్పే ప్రతీది వాస్తవం కాదు. అంటే వారి క్రైస్తవ విశ్వాసాన్ని మేము శంకించుటలేదు కాని, వారు ఇస్లాం పట్ల కలిగియున్న అభిప్రాయాలతో మేము సమ్మతించుట లేదు. వారు సౌవార్తిక క్రైస్తవులైనందువలన వారికి మేము వంతు పాడము, మరియు మేము ఆ పేరు తగిలించుకొనుట వలన ఇతరులు మమ్మల్ని నమ్మాలని మేము కోరము.

మా అర్హతల గురించి ప్రశ్నించినా కూడ ఇదే మాట మేము చెప్తాము. మా రచయితలు కొందరు పలు విశ్వవిద్యాలయాల్లో తత్వశాస్త్రాన్ని, ప్రపంచ మత అధ్యయనాలను, మరి ముఖ్యంగా ఇస్లామీయ అధ్యయనాలను విద్యార్థులకు అభ్యసింపచేసే పండితులుగా ఉన్నారు. ఈనాడు లోకంలో చూస్తే ఇస్లాం గురించి అసత్య ప్రచారము చేస్తున్న క్రైస్తవ బోధకులు ఎందరో ఉన్నారు. అలాగే ఇస్లాంని లోతుగా స్వాధ్యయనం చేసి ఇస్లాం గురించి లోతైన అవగాహన కలిగియున్న పామరులూ ఎందరో కలరు. మా రచనల నాణ్యతను మీరే పరిశీలన చేయండి, అంతేకాని అర్హతాధికారముల మోసపు మోజులో మాత్రం ఎన్నటికీ పడకండి.

ఇవన్నీ చెప్పిన పిదప, మేము కూడా సువార్తకు ప్రాముఖ్యతనిచ్చే సౌవార్తిక క్రైస్తవులమనే తెలియజేస్తున్నాము. అంతేకాకుండా, మచ్చుకు World Evangelical Alliance మరియు Lausanne Committee for World Evangelization వారు ప్రకటిస్తున్న క్రైస్తవ విశ్వాస ప్రమాణమే మేమూ నమ్ముతూ అనుసరిస్తున్నామని తెలియచేస్తున్నాము.

ఆయనను, ఆయన సత్యాన్ని మీరు అన్వేషిస్తుండగా మహా దేవుడైన ప్రభువే మిమ్ములను ఆశీర్వదించి నడిపించునుగాక.

ఇట్లు మీ ఆన్సరింగ్ ఇస్లాం బృందం.


ఇటువంటివే ఇంకొన్ని విషయాలు:

ఈ విషయములను గురించి ఇంకా వివరముగా ఆంగ్లంలో చదవగలరు - Who is (behind) "Answering Islam" ?


ఆన్సరింగ్ ఇస్లాం తెలుగు