ముహమ్మద్ యొక్క శత్రువులు

మనుష్యులు తమ శత్రువుల పట్ల ఎలా నడచుకుంటున్నారనే దాన్నిబట్టి వారి వ్యక్తిత్వాన్ని అంచనా వేయవచ్చు. సమస్తమూ మన స్వాధీనములో ఉన్నప్పటికంటే, మనలను ఎప్పుడైనా ఎవరైనా వత్తిడి చేసి, సవాలు చేసి ప్రశ్నించినప్పుడే మన నిజస్వభావం మరియు వ్యక్తిత్వం బయటపడతాయి.

ముహమ్మద్‍కు ఆరోపించబడిన “నిర్దోష వ్యక్తిత్వము”ను ఆధారంగా చేసికొని ముహమ్మదు దేవుని ప్రవక్తయని మరియు అతని సందేశమైన ఖుర్‍ఆన్ నిజదేవుని వాక్యమని ఋజువు చేయటానికి ముస్లిములు పూనుకొనుటను మనము సాధారణాముగా చూస్తూ ఉంటాము.

ఈ పేజీలో ప్రపంచమును మేలుకేగాని కీడుకేగాని ప్రభావితము చేసిన ముహమ్మద్‍‍ను గూర్చిన మా అంతిమ నిర్ణయాలను మరియు దానికి ఉపకరించిన ఇస్లాంమత పాఠ్యసామగ్రిని మీ ముందుంచుతున్నాము. వీటిని అధ్యయనము చేసిన తరువాత మీరే ఆత్మావలోకనము చేసికొని పక్షపాతము లేని జ్ఞానసహిత నిర్ణయము తీసికొనగలరని ఆశిస్తున్నాము.

ముహమ్మద్ కావించిన, ఆజ్ఞాపించిన లేక కోరుకొని హత్య చేయించిన వారి పేర్లలో కొన్ని ఇక్కడ ఇవ్వబడ్డాయి. వీరిలో అనేకులు పాశవికంగా హత్య చేయబడ్డారు, కొందరేమో నిష్కారణంగా హత్యకు గురయ్యారు. ఏది ఏమైనా, క్రియలు వాటి వెనుక ఉండే ఉద్దేశాలనుబట్టి విమర్శించబడుతవి; అంతేకాకుండా ఎవరినైనా సరే పాశవికంగా హత్య చేయించాలని ఉద్దేశించటమే క్షమాపణకు నోచుకోని అతిపెద్ద తప్పు.

పలు సందర్భాలలోని కొన్ని ఉదాహరణలు:

  1. సల్లం ఇబ్న్ అబు’ల్-హుకైక్ యొక్క హత్య
  2. కేవలం అనుమానముతో ముహమ్మద్ హత్యలు చేయుట
  3. ముహమ్మద్ మరియు ఆమ్ర్ బిన్ జిహాష్ హత్య

ముహమ్మదు
ఆన్సరింగ్ ఇస్లాం తెలుగు