ఖుర్‍ఆన్ ప్రకారం మానవ నిర్మాణ శాస్త్రం

ఈ మధ్యన ముస్లింలు ఖుర్‍ఆన్‍లో మానవ నిర్మాణానికి సంబంధించిన నవిన సైన్సు ఉంది అని ఎంతో ప్రచారం చేస్తున్నారు. ఆ ప్రచారంలో భాగంగా బైబిల్లో ఉన్నదంతా తప్పు అనే తప్పుడు ప్రచారం కూడా మొదలు పెట్టారు. ఐతే ఇందులో వాస్తవం ఎంత? ఖుర్‍ఆన్‍లో మానవ నిర్మాణానికి సంబంధించిన నవీన సైన్సు ఉందో లేదో ఈ వ్యాసంలో చదువుదాం. వారి వాదనల్లోని వాస్తవావాస్తవాలను జాగ్రత్తగా పరిశీలిద్దాం.

1. మొట్టమొదటగా మానవ నిర్మాణ పద్ధతి గురించి ఖుర్‍ఆన్ ఏమి చెబుతోందో చూద్దాం:
మానవుడిని వారి అల్లాహ్ దేవుడు ఇలా సృష్టించాడట-
    * 11:61 - భూమి నుండి సృష్టించాడు (అల్ అర్ది)
    * 15:26,28,33 - కుళ్ళిన మట్టిమొక్క ఎండిన గారతో సృష్టించాము (మిన్ సల్సాలి మిన్ హమయిన్ మస్నూనిన్)
    * 17:61 - మట్టితో (తీనన్)
    * 32:7 - మట్టిలో (తీనిన్)
    * 19:67 - ఏమీ కాని దాంట్లోంచి (లేక) ఏమీ కాని పదార్థం నుండి (శూన్యం నుండి) (వలం యకు షైఅన్)
    * 52:35 - ఏమీ కాని దాంట్లోంచి (మిన్ గైరి షైయిన్)
    * 23:12 - మట్టి సారంతో (లేక మట్టి సంతానం లేక కుంటుంబం నుండి) (సులాలతిన్ మిన్ తీనిన్) (సారం అనే అర్థం రావాలంటే అరబీ భాషలో జైత్, మహియత్, జౌహర్, ఐన్ అనే పదాలు వాడబడి ఉండాలి, కాని అవి ఇక్కడ వాడబడలేదు కాని సంతానం లేక కుటుంబం అనే అర్థం వచ్చే సులాలత్ అనే పదమే వాడబడింది)
    * 38:71 - మట్టిలో నుండి (తీనిన్)
    * 25:54 - నీటిలో నుండి (మిన్ అల్‍మాయి)
    * 35:11 - ధూళిలో నుండి సృష్టించాము (ఖలకకుం మిన్ తురాబిన్)
    * 3:59  - ధూళిలో నుండి (మిన్ తురాబ్)
    * 30:20 - మిమ్మల్ని ధూళిలోనుండి సృష్టించాడు, తరువాత మీరు చెదిరిన (లేక) వ్యాపించిన మానవులయ్యారు. (ఖలకకుం మిన్ తురాబిన్, తుమ్మ ఇదా అన్తుం బషరున్ తన్తషిరూన). ఇక్కడ అరబీ భాషలో “మిమ్మల్ని” అని, మానవులందర్నీ ధూళిలో నుండే సృష్టించినట్లు చెప్తున్నాడు. ఎంత పెద్ద పొరపాటు!
    * 39:6 - మిమ్మల్ని ఒకే ప్రాణి (ఆదాము) నుండి సృష్టించాడు. తరువాత ఆయనే ఆ ప్రాణి నుండి దాని జంటను చేశాడు. మరియు ఆయన మీ కొరకు పశువులలో ఎనిమిది మగ, ఆడ జాతులను క్రిందకు అవతరింపచేశాడు (లేక జన్నత్ అనబడే దివ్య తోట నుండి క్రిందకు భూమి మీదకు దించాడు). (ఖలకకుం మిన్ నఫ్సిన్ వాహిదతిన్, తుమ్మ జఅల మిన్ హా జౌజహా వ అన్జల లకుం మినల్ అన్‍ఆమి తమానియత అజ్వాజిన్).ఇక్కడ పశువు అంటే - ఒంటే, ఆవు, గొఱ్ఱె, మేక (జంటలుగా మొత్తం 8 దివ్య జంతువులు). మనుష్యులందరినీ సృష్టించేశాకనే ఆదాముకు భార్య అయిన అవ్వను చేసినట్లుగా చెప్తున్నాడు. అంతేకాకుండా పైన పేర్కోనబడ్డ ఎనిమిది  జంతువులను - దివ్య జంతువులుగా తన యొద్ద నుండి అవతరింపచేశానని చెప్తున్నాడు. అంటే జన్నత్ అనబడే ఆ తోటలో కూడా జంతువులు ఉంటాయా? వాటిని చంపి తినటం, వాటి పాలు తాగటం వంటి భూలోక అవసరాలు అక్కడ కూడా ఉంటాయా? అల్లాహ్ యొక్క ఈ జన్నత్ అనబడే తోట యెహోవా దేవుని పరలోకానికన్నా ఎంతో భిన్నంగా ఉంది కదా?
    * 4:1 - ఆయన మిమ్మల్నందరినీ ఒకే ప్రాణి నుండి సృష్టించాడు, (అల్లదీ ఖలకకుం మిన్ నఫ్సిన్ వాహిదతిన్). మానవులందరినీ ఒకే ప్రాణి నుండి సృష్టించాడు అని చెప్పడం పెద్ద తప్పు. మనల్ని దేవుడు ఆదామవ్వలనుండి పుట్టించాడు గాని ఒక్కడి నుండి సృష్టించలేదు. ఖురాన్ తప్పు చెబుతోంది. చూశారా ఖురాన్లో మానవ సృష్టి గురించి ఎన్నిరకాల ఆవకతవకలు ఉన్నాయో?

2. స్వల్పమైన  బిందువులో నుండి:
    * 16:4 - ఆయన మానవుణ్ణి స్వల్పమైన బిందువు నుండి సృష్టించాడు (ఖలకత్ ఇస్సాన మిన్ నుత్ఫతిన్)
    * 32:8 - తుచ్ఛమైన ద్రవపదార్థం యొక్క సారంలో (మిన్ సులాలతిన్ మిన్ మాయిన్ మహీనిన్)
    * 35:11 - ఇంద్రియ బిందువులతో (మిన్ నుత్ఫతిన్)
    * 53:46 - విడిచే ఒక బిందువు ద్వారా (మిన్ నుత్ఫతిన్ ఇదా తుమ్మా)
    * 56:58 - మీరు విడిచే ఈ రేతస్సుతో బిడ్డను మీరు తయారు చేస్తారా? (మా తమ్నూన). (కేవలం పురుషుడి రేతస్సుతోనే బిడ్డలు పుట్టుకొస్తారంటూ, మీకూ చేతనైతే స్త్రీ అండం లేకుండానే కేవలం మీ రేతస్సుతోనే బిడ్డల్ని తయారుచేయండని సవాలు విసరడం ఎంత అవివేకం?)
    * 75:37 - అతడు కార్చబడిన (లేక) స్ఖలితమైన రేతస్సులోని బిందువు కాడా? (అలంయకు నుత్ఫతన్ మిన్ మనియ్యిన్  యుమ్నా)
    * 76:2 - ఒక మిశ్రమ వీర్యబిందువుతో సృష్టించాడు (పరీక్షించడానికి) (ఇన్నా ఖలక్నా అల్ఇన్సాన మిన్ నుత్ఫతిన్ అమ్షాజిన్)
    * 80:19 - ఒక రేతస్సు బిందువుతో ఆయన అతడిని సృష్టించాడు. (మిన్ నుత్ఫతిన్ ఖలకహూ). ఎవరా అతడు? ఆదామా? తప్పు తప్పు, ఆదాము మట్టి నుండి కదా సృష్టించబడింది!
    * 86:6-7 - వెన్నెముకకు, ప్రక్కటెముకలకు మధ్యనుండి దూకుడుగా వెలువడే ఒక ద్రవ పదార్థంతో అతడు సృష్టించబడ్డాడు. (ఖలక మిన్ మాయిన్ దాఫికిన్ (దూకుడుగా), యఖ్‍రుజు (అది వెలువడుచున్నది) మిన్ బైనిస్సుల్బి వత్తరాయిబి).

పైన మనం చదివిన రెఫరెన్సులలో - సైన్సు ప్రకారంగా మాత్రమే తెలుసుకోగలిగి, మరే ఇతర విధానంలో మనం తేలుసుకోలేని మర్మాలు ఏవైనా ఉన్నాయా?  అస్సలు లేవు కదా!  మానవుడు వీర్యం నుండి పుట్టాడు లేక సృష్టించబడ్డాడు అంటాడు. ఎంత అవివేకం! (స్త్రీ) అండం గూర్చిన ప్రస్తావన మచ్చుకైనా కానరాదు! పాపం అల్లాహ్‍కి ఈ విషయం తెలియదు. పోనీ, వీర్యస్ఖలనం ద్వారా పిల్లలు పుడతారు అనడానికి సైన్సు తెల్సుండాలా? తన వీర్యాన్ని చూసుకొనే ప్రతి మగాడికీ ఈ విషయం తెలుసు. పోతే మనిషి వీర్యం వాడి వెన్నెముకకూ ప్రక్కటెముకలకూ మధ్యనుండి దూకుడుగా వెలువడుతోంది అనడం ఎంత అవివేకం! ఎంత హాస్యాస్పదం! ఆ మాటలు ముహమ్మదు కాలంలో ఉండిన వైద్యులు ప్రజలకు ప్రచారం చేస్తూఉండినవి. కానీ ఆ మాటలు ప్రతి నవీన వైద్య గ్రంథం నుండి ఎప్పుడో తీసిపారేశారు. ఎందుకంటే అవి సుద్ధతప్పు అని తేలాయి కాబట్టి. నిజానికి వెన్నెముకకూ ప్రక్కటెముకకూ మధ్య ఏమున్నాయి? - గుండె, ఉపిరితిత్తులు ఉన్నాయి. పాపం అల్లాహ్‍కు ఈ విషయాం కూడా తెలీదు. ఈ విషయాన్ని కప్పిపుచ్చుకోవడానికి ముస్లింలు ఏమంటారంటే - పురుషుడి వృషణాలు వాడి కడుపులో తయారవుతాయి; కాబట్టి పురుషుడి వీర్యం వాడి వెన్నెముక దగ్గర్నుంచి దూకుతున్నట్లే అంటారు. ఎంత అవివేకం! పురుషుడికి వీర్యం వృషణాలలో తయారవ్వాలంటే వాడు యవ్వనంలోకి రావాలి. అప్పటివరకు వీర్యమే తయారవ్వదు. మరి వాడు పుట్టకమునుపు వాడి కడుపులో వృషణాలు తయారయ్యేటప్పుడే వాడిలో వీర్యం ఏర్పడి దూకూడిగా ప్రవహిస్తూ ఉంటుంది అనడం ఖురాన్లోని అవివేకానికి పరాకాష్టగాక ఇంకేమికాదు.

3. ఖురాన్‍లో మానవ పిండం ఎదుగుదల:
    * 22:5 - తరువాత నిశ్చయముగా మేము మిమ్మల్ని సృష్టించాం - మట్టిలో నుండి, తరువాత వీర్యబిందువునుండి, ఆ తర్వాత నెత్తుటి గడ్డలో నుండి, ఆ తర్వాత మాంసపు కండలో నుండి; అది రూపం కలదిగానూ, రూపంలేనిది గానూ ఉంటుంది. (ఫ ఇన్నా ఖలక్నాకుం మిన్ తురాబిన్ తుమ్మ మిన్ నత్ఫతిన్ తుమ్మ మిన్ అలకిన్, తుమ్ము మిన్ ముద్గతిన్ ముఖల్లకతి వగైరి ముఖల్లకతిన్).
    * 23:12-14 - మేము మానవుణ్ణి మట్టి మొక్క సారంతో సృష్టించాము; తరువాత అతనిని ఒక సురక్షితమైన స్థానంలో పడే బిందువుగా (నుత్ఫ) మార్చాము, ఆ తరువాత ఈ బిందువుకు రక్తపు గడ్డ (అలక) ఆకారాన్ని ఇచ్చాము, ఆ పైన ఆ రక్తపు గడ్డను కండగా (ముద్గ) చేశాము, తరువాత మాంసపుకండను ఎముకలుగా చేశాము, ఆ తరువాత ఎముకలకు మాంసాన్ని తోడిగాము ఆపైన దానిని భిన్నమైన సృష్టిగా చేసి నిలబెట్టము, కనుక అల్లాహ్ ఎంతో శుభప్రదుడు, సృష్టికర్తలందరిలోకెల్లా ఉత్తమ సృష్టికర్త. (వ లకద్ ఖలక్నల్ ఇన్సాన మిన్ సులాలతిన్ మిన్ తీన్. తుమ్మ జ‍అల్‍నాహు నుత్ఫతన్ ఫీ కరారిన్ మకీన్. తుమ్మ ఖలక్నన్ నుత్ఫత  అలకతన్ ఫ ఖలక్నల్ అలఖత ముద్గతన్ ఫ ఖలక్నల్ ముద్గత ఇజామన్ ఫ కసౌనల్ ఇజామ లహ్‍మన్ తుమ్మ అన్షనాహు ఖలకన్ ఆఖర్; ఫ తబారకల్-లాహు అహ్సనుల్ ఖాలికీన్).

చూశారా ఖురాన్ చెప్పే సైన్స్! మొదట మానవుడిని మట్టి నుండి చేశాడట, తరువాత అదే మానవుడిని వీర్యబిందువుగా మార్చాడట, అంటే - వీర్యబిందువు మనిషియొక్క సూక్ష్మరూపమా? వీర్య బిందువులో మానవుడికి సంబంధించిన క్రోమోజోముల్లోని సగభాగం మాత్రమే ఉంటాయి కాబట్టి అతడు సూక్ష్మరూపంలో ఉన్న మానవుడు కాడు. ఆ వీర్యబిందువును ఒక “అలక” గా అంటే రక్తపు గడ్డగా చేశామంటాడు. మానవ నిర్మాణంలో అసలు ఈ రక్తపు గడ్డలు బోత్తిగా ఉండవని, ఒకవేళ పిండదశలోని మానవుడిలో రక్తపు గడ్డలేర్పడితే పిండం చచ్చిపోతుందని, గర్భస్రావం అవుతుందని, ఇది సృష్టివిరుద్ధమని అల్లాహ్‍కి పాపం తెలిసినట్టులేదు - ఎంత అమాయకుడో పాపం! తర్వాత రక్తపు గడ్డల్లోంచి “ముద్గ”ను, అంటే మాంసపు కండను చేశామంటాడు. నవీన సైన్సు చదివే విద్యార్థులెవరైనా సరే ఇట్టే చెప్పేస్తారు - రక్తపుగడ్డల్లోంచి కండ తయారు కాదని. పాపం అల్లాకు ఈ విషయం ఏదీ తెలిసినట్లులేదు. “తర్వాత మాంసపు కండను ఎముకలుగా సృష్టించాము” అంటాడు. మానవ నిర్మాణ క్రమంలో మాంసపు ముద్ద ఎముకలుగా మారనే మారదని సైన్సు విద్యార్థులందరికీ తెల్సు- అల్లాహ్ కి మాత్రం తెలియదు. పోనీలే పాపం. ఆ తర్వాత ఎముకలకు మాంసం తోడిగాము - మానవ నిర్మాణ క్రమాన్ని చూస్తే - ఎముకలకు మాంసం తొడిగించడం అనే పద్దతే లేదు. మాంసము ఎముకలు ఒకేసారి కలిసి ఏర్పడుతుంటాయి గాని ఎముకలు ముందే ఏర్పడి ఆ తర్వాత మాంసం వాటిమీద ఏర్పడడం అనేది శుద్ధ తప్పు.

చివర్లో కొసమెరుపు చూశారా - అల్లాహ్ సృష్టికర్తలందర్లో కెల్లా ఉత్తమ సృష్టికర్తట. ఖురాన్ ప్రకారం అల్లాహ్‍తో పాటుగా ఎంతో మంది సృష్టికర్తలున్నారు. కాని అల్లాహ్ వారందర్లోకెల్లా ఉత్తముడట. ఇతను కూడా అనేకమంది సృష్టికర్తల్లో ఒకడు కాబట్టి (అతని సోంత మాటల్లోనే) ఇతడు అద్వితీయ సృష్టికర్తయిన యెహోవా దేవుడు ఎంతమాత్రం కాడు. కాబట్టి ఇతడసలు మన సృష్టికర్తే కాడు, అలా చెప్పుకున్నాడంతే.

4. అలక అంటే అర్థమేమిటి? మానవుడు అలకనుండి వచ్చాడా?
ఖురాన్ 96:2లో అల్లాహ్ మానవుడిని పేరుకుపోయిన నెత్తుటి గడ్డలతో సృష్టంచాడని చదువుతాం. మనిషి నెత్తుటి గడ్డల్లోంచి పుడ్తాడా? ఎంత అవివేకం! బహుశా ముహమ్మద్ ప్రవక్త యొక్క 13 భార్యలకు రక్తస్రావమో, గర్భస్రావమో జరిగినప్పుడెల్లా అతడు చూసి ఈ రక్తపు గడ్డల్లోంచే మనిషి తయారవుతాడని తలంచి అలా చెప్పుండోచ్చు.   

నిజానికి ముస్లింలు తమ ఖురాన్‍లోని 96:2లో ఉన్న “అలక్” అనే మాటకు - “రక్తపుగడ్డ” అని అర్థం చెప్తారు. కానీ మౌలానా సయ్యద్ మౌదూదీ గారు వ్రాసిన ప్రపంచ ప్రసిద్ధి చెందిన "తఫ్‍హీముల్ ఖురాన్" అనే ఖురాన్ వ్యాఖ్యానంలో ఆయన “అలక్” అనే అరబీ పదానికి “రక్తపుగడ్డ” అని ఏకవచన అర్థం లేదు గాని “రక్తపుగడ్డలు” అని బహువచన అర్థం తీసుకోవాలి, ఎందుకంటే “అలక్” అని అక్కడ వాడబడిన పదం అరబి భాషలో “అలక” అనే ఏకవచనానికున్న బహువచన రూపం అని వివరించారు. కాబట్టి ఖురాన్ ప్రకారం మనిషి - పేరుకు పోయిన రక్తపు గడ్డనుంటి కాదుగాని పేరుకుపోయిన రక్తపు గడ్డలలోంచి పుడతాడు. ఇది సైన్సుకు వ్యతిరేకం. అసలు నిజం ఏమంటే - మానవ నిర్మాణంలో “రక్తపుగడ్డ” అనే స్థిత లేక రూపం లేనేలేదు. పిండం రక్తపుగడ్డల్లోంచి ఏర్పడదు, పిండంలో రక్తపుగడ్డలూ ఏర్పడవు. ఒక వేళ పిండంలో గనుక రక్తపు గడ్డలేర్పడితే ఆ పిండం చచ్చూరుకుంటుంది. ఐతే ఇదే సైన్సట, మనం నమ్మాలట!

ఈ మధ్య కొందరు నవీన ముస్లిం రచయితలు, “అలక” అనే పదానికి రక్తపు గడ్డలు అని కాకుండా, “వ్రేలాడే వస్తువు” అని అర్థం చెప్తున్నారు. మరి గర్భంలో అలా వ్రేలాడే వస్తువులు (బహువచనం) ఎన్నున్నాయో వారే మనకు చెప్పాలి. ఇస్లాం పుట్టక మునుపు క్రీస్తు పూర్వం 4వ శతాబ్దంలో అరిస్టోటెల్ అనే గ్రీకు వైద్యుడు, తల్లి గర్భంలో బిడ్డ బొడ్డుతాడుతో గర్బాశయం గోడకు అతుకబడి ఉంటుందని ఎప్పుడో చెప్పేశాడు. అలాంటప్పుడు ఇస్లాం క్రొత్తగా తెలిపిందేమిటి? అరిస్టోటెల్ ఆ విషయాన్ని ప్రపంచానికి ముందే తెలిపాడు కదా! అది అప్పటికే అందరికీ తెలిసిన విషయం కదా! కానీ ఖరాన్ అందరికీ తెల్సిన విషయంలో కూడా పప్పులో కాలేసింది. అరిస్టోటెల్ తన పుస్తకంలో బొడ్డుతాడుతో గర్బాశయం గోడకు పిండం అతుకబడి ఉంటుందని సరిగ్గా సైన్స్ ప్రకారం చెప్పాడు. కానీ ఖురాను మాత్రం అలా అతుకబడినవి అనేకం వుంటాయి అనే అర్థం వచ్చేట్టుగా బహువచనంలో చెప్పడం, ఎంత హాస్యాస్పదం! అరిస్టోటెల్‍కి తెల్సినంత సైన్సు కూడా పాపం అల్లాహ్‍కి తెలిసినట్లులేదు.

ఇంకొంతమంది నవీన ముస్లిం రచయితలు “అలక” అనే ఈ అరబి పదానికి జీన్ కోడ్ (జెన్యు కోడ్) అని అర్థం చెప్తున్నారు. పోనీ అలా అనుకున్నాగాని ఖురాన్ మరోసారి పప్పులో కాలేసినట్లే. ఎందుకంటే సూరా 22:5లో ఈ విధంగా ఉంది - “ఫ ఇన్నా ఖలక్నాకుం మిన్ తురాబిన్ తుమ్మ మిల్ నుత్ఫితిన్ తుమ్మ మిన్ అలకిన్, తుమ్మ మిన్  ముద్గతిన్” - అంటే - “తరువాత నిశ్చయముగా మేము మిమ్మల్ని సృష్టించాం మట్టిలో నుండి, తరువాత వీర్యబిందువునుండి - ఆ తరువాత నెత్తుటి గడ్డ (లేక) జెన్యుకొడ్ నుండి, ఆ తరువాత మాంసపు కండలో నుండి...” అని అర్థం. చూశారా ఎంత ప్రమాదం జరిగిందో - వీర్యబిందువులో నుండి వారు చెప్తున్న (అలక అనబడే) జెన్యుకోడ్ తయారవుతుందట. ఎంతటి ఘోర అవివేకమవుతుంది ఈ రకమైన నవీన రచయితల అవివేకవ్యాఖ్యానం! సైన్సు ప్రకారం విర్యబిందువులలో నుండి జన్యుకోడ్ ఏర్పడి, ఆ తర్వాత ఆ జన్యుకోడ్ నుండి మాంసపు కండ ఏర్పడుతుందనడం శుద్ధతప్పు. పాపం ఎలా తప్పించుకోవాలో తెలియక ఈ రకమైన వ్యాఖ్యానాలు చెప్తూ వారే ఇరుక్కుంటున్నారు.

5. ఇప్పుడు ముద్గ అనే పదాన్ని విశ్లేషిద్దాం:
సూరా 22:5లో- "మిమ్మల్ని మాంసపు కండనుండి సృష్టించాం" అని ఉంది. అక్కడ అరబి ఖురాన్‍లో వాడబడిన మాట “ముద్గ”. ముద్గ లేక ముద్గత్ అంటే మాంసపు కండ అని అర్థం. నిజానికి ఖురాన్ చెప్తున్నట్లుగా మానవుడు నెత్తుటి గడ్డనుండి మాంసపు కండగా మారుతాడు అనేది సైన్స్ ప్రకారం శుద్ధతప్పు. ఇది తప్పని ఒప్పుకోక పోగా, ఈ మధ్యన నవీన ఇస్లాం రచయితలు ఈ తప్పుని కప్పిపుచ్చుకోవడానికి ముద్గత్ లేక ముద్గ అంటే బాగా నమలబడిన పదార్థం అని అర్థం చెప్తూ, మానవ నిర్మణక్రమంలోని రూపంలేని ఒక స్థితిని (స్టేజ్‍ని) చూపుతూ - ఆ రూపంలేని కండగా కనిపిస్తున్నదాన్నే ఖురాన్ ముద్గ అంటుంది అంటున్నారు. నీజానికి వారు చెప్తున్న రూపంసరిగాలేని ఆ స్థితి 26 లేక 27 రోజులున్న మానవ పిండానికి ఉంటుంది. అప్పుడు దాని సైజు ఎంతో తెలుసా? 3 మిల్లీ మిటర్లు. ఎంతో చిన్న ముద్దలా ఉన్న ఆ స్థితిని (స్టేజ్‍ని) చూసి వారు ఈ పదాన్ని దానికి అంటకడుతున్నారు. నిజానికి బాగా నమిలిన మాంసపు ముద్ద అనాలంటే, అది నోట్లో పెట్టి నమిలేంత సైజులేని, అత్యంత చిన్న సైజులో ఉన్న 3 మిల్లిమీటర్ల (3mm) కణ సముదాయం. మనిషి నోట్లో పెట్టి నమలాలంటే అది కనీసం 20-30 మిల్లిమీటర్ల సైజులో ఉండాలికదా! మరి అలాంటి అర్థం దానికి చెప్పేవారు పప్పులో కాలేశారు. అంతేకాకుండా బాగా నమిలిన మాంసపు ముద్ద ఎలా ఉంటుంది? ఏ భాగానికి ఆ భాగం బాగా నమలబడి ముక్కలు ముక్కలై, ఎంగిలి లేక ఉమ్మితో బాగా కలిసి, నోట్లోని లాలాజలంలో ఉన్న కొన్ని ఎంజైములవల్ల కొంత జీర్ణమై ఉంటుంది. కానీ గర్భంలోని పిండమైతే బాగా నమలబడిన పదార్థంవలె ముక్కలు ముక్కలై, సగం జీర్ణమై ఉండదు. పిండానికైతే దాని నిర్మాణ క్రమంలో ఎన్నడూ ఆ లక్షణాలు ఉండవు. అంటే - అది ముక్కలు ముక్కలుగా ఉండదు, ఎంగిలతో కలిసినట్టుగా వదులు వదులుగా ఎంతమాత్రం ఉండదు, కొంత జీర్ణమైపోయి అంత కంటే ఉండదు. ఆ నవిన ఇస్లాం రచయితలు తిమ్మిని బెమ్మి చేయడంలో అగ్రగణ్యులని అర్థమయిందా?

అసలు ఈ నవీన రచయితలు వ్రాస్తున్న తమ స్వంత కల్పితాలను మనం ప్రక్కన పెట్టి - ఇస్లాం ప్రవక్తైన ముహమ్మద్ ఏమి చెప్పెనో చూద్దాం. ఆయన మాటలు చూస్తే - వీరి పిచ్చి వ్రాతలన్నీ ఇస్లాంకు ఎంత విరుద్ధమో ఇట్టే తెలిసిపోతుంది.

సహీహ్-అల్-బుఖారీ 8:593, 4:549, 9:546, 4:430 అనే రెఫరెన్సులలో వారి ప్రవక్తయైన ముహమ్మద్ ఇలా చెప్పెను - “మీలో ప్రతి ఒక్కరూ తమ తల్లి గర్భంలో (మానవ పిండానికి అవసరమైన పదార్థాలుగా) 40 రోజుల పాటు జమ చేయబడతారు లేక సేకరించబడతారు. ఆ తరువాత (ఆ పోగైన పదార్థాలు) మరో 40 రోజులపాటు పేరుకుపోయిన రక్తపుగడ్డగా మార్పుచెంది ఉండి, ఆ తర్వాత మరో 40 రోజుల పాటు మాంసపు ముద్దగా ఉంటుంది. అప్పుడు అల్లాహ్ ఒక దేవదూతను పంపి 4 సంగతులను వ్రాయమని ఆజ్ఞాపిస్తాడు. అవేవనగా -
   1. వానికివ్వబడబోయే (జీవన) వసతులు
   2. వాని ఆయువు
   3. వాని క్రియలు
   4. వాడు దుష్టులతో చేరుతాడా లేక ధన్యుడవుతాడా?
ఆ తర్వాత వానిలోకి ప్రాణం ఊదబడుతుంది. అల్లాహ్ సాక్షిగా మీలోని ఎవడైనా సరే నరకాగ్నికి పాత్రులయ్యేవారి క్రియలను చేస్తూ చేస్తూ, వానికి నరకాగ్నికి మధ్య బెత్తెడో మూరెడో దూరం మిగిలేంత వరకు ఆ నరకాగ్నికి సమీపమైనాగాని, అల్లాహ్ అతని గూర్చి చెప్పిన ఆ విధి బలీయమై వాడు మరలా జన్నత్‍వాసుల పుణ్యకార్యాలు చేసి జన్నత్‍లోకి వెళ్తాడు. అలాగే మీలోని ఎవడైనా సరే జన్నత్‍వాసుల క్రియలు చేస్తూ చేస్తూ తనకు జన్నత్‍కు మధ్య ఒక బెత్తెడో మూరెడో దూరం మిగిలేవరకు ఆ జన్నత్‍కు సమీపమైనాగాని, అల్లాహ్ అతనికి విధించిన విధి బలీయమై వాడు మరలా నరకాగ్నికి పాత్రమైన పనులు చేసి నరకంలోకే ప్రవేశిస్తాడు.”

ఎంత ఘోరం! ఒకడు మంచి పనులే జీవితాంతం చేస్తూ వచ్చినా, అల్లాహ్ వాడి గురించి నరకాగ్నికి పోవాలని వ్రాసి పెట్టాడు కాబట్టి నరకాగ్నికే పోవాలా? ఈ దేవుడు యోహోవా దేవుడు ఎంతమాత్రం కాలేడు. ఎందుకంటే తన పరిశుద్ధ వాక్యమైన “పరిశుద్ధ గ్రంథంలో” యెహోవా దైవుడు 2 పేతురు 3:9లో ఎవడునూ నశింపవలెనని ఇచ్ఛయించడు అని చూస్తాం. పేరు చెప్పని ఈ అల్లాహ్‍కి నిజదేవుడైన యెహోవాకి మధ్య తూర్పు పడమరలంత దూరం ఉంది కదా! గ్రహించు!

సరే, మరలా ఆ హదీసు రెఫరెన్సులను చూద్దాం. అక్కడ వారి ప్రవక్తయైన ముహమ్మదు చెప్పినదేమిటి?

40 రోజులపాటు మానవ నిర్మణ సామగ్రి తల్లి గర్బంలో సేకరించబడుతుంది. తర్వాత మరో 40 రోజుల పాటు - “అలక”లాగ, అంటే పేరుకుపోయిన నెత్తుటి గడ్డగా మనిషి ఉంటాడు. ఆ తర్వాత మరో 40 రోజుల పాటు - “ముద్గ”లాగ అంటే మాంసపు కండగా మనిషి ఉంటాడు.

అంటే 80 నుండి120 రోజుల వ్యవధి మధ్య మానవుడు “ముద్గ” లాగా లేక మాంసపు కండగా ఉంటాడు - అంటే రూపంలేని బాగా సమలబడిన మాంసపు కండగా ఉంటాడు అని చెప్పబడింది. కానీ ప్రియులారా, ఇది వాస్తవం కాదు. నవీన సైన్సుకి ఇది పూర్తిగా వ్యతిరేకం. నిజం ఏమిటంటే 11 వారాలు లేక 77 రోజులకే అంటే 80 రోజులకంటే ముందే మానవుడు తల్లి గర్భంలో మానవ ఆకృతిని కలిగి ఉంటాడు. మాంసపు కండ రూపం కేవలం 26 లేక27 రోజులప్పుడు ఉంటుందే తప్ప ముహమ్మదు చెప్పినట్లు 80 నుండి 120 రోజుల వ్యవధి మధ్య ఆ రూపం ఉండదు. అంతేకాదు, 40 రోజులపాటు మానవ నిర్మాణ సామగ్రి తల్లి గర్భంలో సేకరించబడుతుంది అని చెప్పబడిందికదా, కానీ మానవ నిర్మాణ క్రమంలో అలా 40 రోజుల పాటు మాత్రమే ప్రత్యేకంగా సేకరించబడే పదార్థాలేమీ లేవు. అలాంటి స్థితి కాని, స్టేజ్ కాని అంతకన్నా లేదు. ఇవన్నీ ఆ అజ్ఞాన కాలపు వైద్యులు ఆ కాలపు ప్రజలకు నేర్పిన తొలి వైద్య ప్రతిపాదనలు. ఈనాడు ఆ వైద్యులే వాటిని తప్పని కొట్టిపారేశారు.

ఈ విధంగా ఖురాన్లోనూ, హదీసుల్లోనూ ముహమ్మద్ ప్రవక్త చెప్పింది కేవలం సైన్సుకు వ్యతిరేకమైనవని, పురాతన వైద్యులు ఆ కాలంలో నమ్మిన ఆశాస్త్రీయ అసత్యాలనీ అనడానికి ఇంతకంటే ఏ ఆధారలు, ఋజువులు కావాలి?

6. కానీ ముహమ్మదుకు ఈ విషయాలన్నీ ఎలా తెలిసుండొచ్చు?
ఇదంతా చదివిన తరువాత అసలు ముహమ్మదుకి ఆ కాలంనాటి వైద్యులు ప్రచారం చేసినవి ఎలా తెలిసుంటాయని మీకు ఆలోచన రావట్లేదా? అసలు రహస్యం ఏమిటంటే - ముహమ్మద్ కాలంలో పర్షియా దేశంలోని జుందిషాపుర్ అనే ఊరిలో ఒక పెద్ద వైద్య కళాశాల (మెడికల్ కాలేజి) ఉండేది. ఆ ఊరు ప్రస్తుత ఇరాన్ దేశంలోని ఆగ్నేయ భూభాగంలో ఉండేది. మూహమ్మద్ పుట్టకమునుపే క్రీస్తు శకం 555లో పర్షియా మహారాజైన ఖోస్రోస్ దాని ప్రారంభించాడు. ఇతడిని అనుషర్వాన్ అని, నుషిర్వాన్ అని కూడా పిలుస్తారు. ఇతని పరిపాలన క్రీస్తు శకం 531 నుండి 579 వరకు సాగింది. ఇస్లాం ప్రాచుర్యం పొందిన రోజుల్లో జుందిషాపుర్‍లోని ఈ వైద్య కళాశాల చాలా పేరుగాంచిన వైద్య కళాశాలగా ఉండేది. అందులో గ్రీకు, భారతీయ, పారసీక సంబంధ వైద్య సంపుటాలు ఉండేవి. మనం ఇంతకు ముందు చూసిన అరిస్టాటెల్, (Aristotle), గాలెన్ (Galen) వంటి ప్రముఖ గ్రీకు వైద్యుల పుస్తకాలను సిరియా భాషలోకి అనువాదం చేసి వాటినే ప్రధాన వైద్య బోధగా అక్కడ బోధించడం జరిగేది. ఇబ్న్-అబి-ఉసైబియ అనే ఇస్లాం చరిత్రకారుడు క్రీస్తు శకం 1242 లో “వైద్యులలోని శ్రేణులు” (క్లాసెస్ ఆఫ్ ఫిజీషియన్స్) అనే గ్రంథం వ్రాశాడు. ఇంకా అల్-కిఫ్తి అనే మరో ఇస్లాం చరిత్రకారుడు క్రీస్తు శకం 1227లో తత్వవేత్తల చరిత్ర (హిస్టరి ఆఫ్ ధ ఫిలాసఫర్స్) అనే గ్రంథం వ్రాశాడు. వీరిద్దరూ ఆ చరిత్ర గ్రంథాలలో తెలిపిందేమంటే - జుందిషాపుర్‍లోని ఆ వైద్య కళాశాలలో వైద్యశాస్త్రాన్ని ఆభ్యసించిన వారిలో - “హారిత్-ఇబ్న్-కలద” అనే ఒక వైద్యుడుండేవాడు. ఇతడు ముహమ్మద్‍ను ఎంతో సమీపంగా అనుసరించిన అనుమాయులలో ఒకడు, ముస్లింల వైద్య పారంపర్యం ప్రకారం ముహమ్మద్ ఇతడి నుండే వైద్య సలహాలను పొందుచుండెను అని తెలుస్తోంది. ఇతడు మక్కాకు దగ్గరలోని తైఫ్ అనే ఊరిలో పుట్టినవాడు. ముహమ్మద్‍కి బంధువు కూడా. ఇతడు మక్కాలోనే స్థిరనివాసం ఏర్పరచుకొని, ఎడారి అరబ్బులందరికీ ప్రప్రధాన వైద్యుడయ్యాడు. ఇతడు ఇస్లాంను అంగీకరించెనో లేదో తెలియదు గాని, ముహమ్మద్ మాత్రం రోగులైన తన స్నేహితులను అతడి దగ్గరకే పంపుచుండెను. ఐతే ఇతడికి పిల్లలు లేనందువల్ల "హారిత్-అల్-నసర్‍" అనునతడిని దత్తతు తీసికొన్నాడు. ఈ నసర్ ముహమ్మద్‍కి సమీపబంధువు (ఆంగ్లంలో కసిన్ అంటాం). ఇతడు కూడా వైద్యుడే. ఆశ్చర్యం కలిగించే విషయం ఏమంటే ఈ హారిత్- అల్- నసర్ ముహమ్మద్‍ని వెక్కిరించి ఖురాన్లోని కథలు తాను నేర్చుకొన్నపాత పర్షియా కథలకన్నా పెద్ద జ్ఞానం కలవికావని అనేవాడు. అందువల్ల ముహమ్మద్ ప్రవక్త అతడిని బద్ర్ యుద్ధంలో పట్టుకొని క్రీస్తుశకం 624లో చంపించేసెను.

ఇప్పుడర్థమయిందా ఖురాన్లో నేటికీ అలనాటి గ్రీకు సైన్సు ఎందుకుందో, ఎలా ఖురాన్లోకి అది వచ్చిందో. అలనాడు గాలెన్, హిప్పోక్రేట్స్ మరియు అరిస్టోటెల్ అనే గ్రీకు వైద్యులు చెప్పిందే, అన్ని నవీన వైద్య గ్రంథాల నుండి ఎప్పుడో తోసిపారేసిన ఆ పాత ఊహాగానాలే ఈ రోజుకీ ఖురాన్లో ఉన్నాయని తేలిన తర్వాత అది దైవదత్త గ్రంథమని ఎవరూ నమ్మలేరు. ఈ విషయాలు తెలియని వారు నమ్మాల్సిందే. నమ్మిన వారు మాత్రం నిశ్చయంగా నష్టపోతారు. కానీ ఈ విషయాలన్నీ మనకు తెలిపి సత్యం ఋజువు చేసిన యెహోవా దేవునికే నిత్యం మహిమ కలుగును గాక.

ప్రియ సహోదర సహోదరీల్లారా, మీరు సత్యం తెలుసుకున్నాక కూడా అసత్యాన్నే నమ్మితే మీ శత్రువైన సాతానుకు పట్టే గతే మీకూ పడుతుంది. ఎందుకంటే అపవాది అనబడిన సాతాను ఆదినుండి నరహంతకుడైయుండి సత్యమందు నిలిచినవాడు కాడు; వానియందు సత్యమేలేదు, వాడు అబద్ధమాడునప్పుడు తన స్వభావము అనుసరించియే మాటలాడును; వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడునైయున్నాడు. మీరు సత్యమందు విశ్వాసముంచుడి అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులనుగా చేయును. (యోహాను 8:32,44)

ఈసా కాదు కాని యేసే సత్యం. ఆయన వాక్యమే సత్యం. యేసుని మీ రక్షకునిగా విశ్వసించుడి అప్పుడు మీరూ మీ ఇంటివారూ రక్షణ పొందెదరు. (అపొస్తలుల కార్యములు 16:31)
హల్లేలూయ,
ఆమేన్.

ఈ వ్యాసాన్ని ఇంకా విపులంగా చదవాలంటే ఆంగ్లంలో చదువగలరు - A second look at "Embryology in the Qur'an" (Lactantius).


ఖుర్‍ఆన్
ఆన్సరింగ్ ఇస్లాం తెలుగు